జమ్మూ కాశ్మీర్‌లో మానవహక్కుల పరిస్థితిని పరిశీలించేందుకు పాకిస్థాన్ పార్లమెంటు ఒక ప్యానెల్‌ను వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం పాకిస్థాన్ నిర్ణయించింది. కాశ్మీరీయుల హక్కులు, ఆత్మగౌరవం పోరాటం చేసే కాశ్మీరీయులకు మద్దతు ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.
మంగళవారం సమావేశమైన జాతీయ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. దీనిని న్యాయశాఖ మంత్రి సభలో ప్రవేశపెట్టారు. కమిటీ కాశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘనపై నిశితంగా పరిశీలిస్తుందని తీర్మానంలో పేర్కొన్నారు. అలాగే కమిటీ ఉల్లంఘనను పరిశీలిస్తుంది.
ఈ కమిటీ దేశీయంగా, దేశం బయట కూడా కాశ్మీర్ సమస్యపై చైతన్యం తీసుకువస్తుంది. రాజకీయంగా, నైతికంగా, ప్రజాస్వామ్య బద్దంగా కాశ్మీర్‌కు మద్దతు ఇస్తారు.
|