ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > అంతర్జాతీయ > పాక్‌లో సైనిక చర్యలు అవాస్తవం: నాటో
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పాక్‌లో సైనిక చర్యలు అవాస్తవం: నాటో
నాటో ఆధ్వర్యంలోని అంతర్జాతీయ భద్రతా సహాయ బలగాలు (ఐఎస్ఎఎఫ్) పాకిస్తాన్ భూభాగంలో సైనిక చర్యలు నిర్వహించినట్లు పత్రికల్లో వచ్చిన వార్తలను నాటో ఖండించింది. ఈ అంశంపై పత్రికల్లో వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమని ఐఎస్ఎఎఫ్ ప్రతినిధి ఓ ప్రకటనలో తోసిపుచ్చారు.

ఆప్ఘన్ ప్రజలు తమ దేశాన్ని పునర్నిర్మించుకునేందుకు గాను తగిన భద్రత, సుస్థిర ప్రభుత్వాన్ని అందజేయడంలో తాము ఆప్ఘనిస్తాన్‌కు సహాయపడుతున్నామని ఐఎస్ఎఎఫ్ ప్రతినిధి నొక్కి చెప్పారు. ప్రత్యేకంగా పాక్ భూభాగంలో తన బలగాల చర్యలు, గాలింపుకు సంబంధించి వస్తున్న ఆరోపణలపై అనేక సార్లు తాము విచారణ జరిపామని ఈ ప్రతినిథి చెప్పారు.

తమ బలగాలు ఆప్ఘన్-పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో కొన్ని సార్లు కాల్పులు జరిపి ఉండవచ్చని అయితే అది కూడా ఆమోదించిన నిబంధనలు, ఆత్మరక్షణ సందర్భాల్లోనే జరిగిఉంటుందని ఐఎస్ఎఎఫ్ ప్రతినిధి చెప్పారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే పాకిస్తాన్ అధికారులకు తాము నివేదిస్తున్నామని, అయితే పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించేందుకు తాము ఏ సమయంలో కూడా ఐఎస్ఎఎఫ్‌కు అధికారం ఇవ్వలేదని స్పష్టం చేశారు.

కాగా, పాకిస్తాన్ వాయవ్య సరిహద్దు ప్రాంత గవర్నర్ ఒవైసీ అహ్మద్ ఘని బుధవారం ఓ ప్రకటన వెలువరిస్తూ, ఆప్ఘన్ సరిహద్దు ప్రాంతం నుంచి పాకిస్తాన్‌ గ్రామంపై దాడిచేసిన విదేశీ దళాలు 20 మంది పౌరులను బలిగొన్నట్లుగా పేర్కొనడం పాకిస్తాన్‌లో ఆగ్రహావేశాలను రేకెత్తించింది.
మరిన్ని
అమెరికా ఏకపక్ష దాడి ఉల్లంఘనే: పాక్
అణు పరీక్షలు జరిపితే ఇంధనం కట్: అమెరికా
ఎన్ఎస్‌జి కీలక సమావేశం నేడే
తీవ్రవాదుల దాడి నుంచి తప్పించుకున్న గిలానీ
థాయ్‌ రాజధాని బ్యాంకాగ్‌లో ఎమర్జెనీ
త్వరలోనే పాక్ ప్రభుత్వం కూలిపోతుంది: షరీఫ్