ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > అంతర్జాతీయ > అణు సరఫరా దేశాల భేటీలో పురోగతి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అణు సరఫరా దేశాల భేటీలో పురోగతి
భారత అణు ఏకాకితనానికి ముగింపు పలికేందుకు గాను అణు ఇంధన సరఫరా సభ్యదేశాల ఆమోదం పొందే విషయంలో కాస్త పురోగతి కనిపిస్తోందని అమెరికా ప్రకటించింది. భారత్ అణు పరీక్షలు జరిపే పక్షంలో అణు సహకారాన్ని నిలిపివేసేలా నిబంధనలను అణు ఒప్పందం ముసాయిదాలో చేర్చాలని ఎన్ఎస్‌జి దేశాలు కొన్ని కోరుతున్న నేపథ్యంలో అమెరికా వియన్నా సమావేశ ఫలితాలపై కాస్త ఆశాభావాన్ని ప్రదర్శించింది.

వియన్నాలో రెండు రోజుల పాటు జరిగే అణు సరఫరా బృంద దేశాల సమావేశం గురువారం ప్రారంభమైన సందర్భంగా కొన్నిదేశాలు భారత్ అణు మినహాయింపు పొందితే తన సైనిక అణు ప్రోగ్రాములకోసం దానిని ఉపయోగించుకుంటుందని అభిప్రాయపడ్డాయి.

న్యూజిలాండ్, ఆస్ట్రియా, నార్వే, ఐర్లండ్, నెదర్లాండ్స్ మరియు స్విట్జర్లండ్ దేశాలు ప్రస్తుత ముసాయిదా పట్ల పూర్తి సంతృప్తి ప్రదర్శించలేదు. అయితే ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశాన్న ప్రపంచ అణు స్రవంతిలోకి తీసుకువచ్చే చారిత్రక అవకాశాన్ని ఈ ముసాయిదా మనకు అందిస్తోందిని చెబుతూ అమెరికా ఈ ఒప్పందానికి సానుకూల వాతావరణం కల్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

ఎన్ఎస్‌జి దేశాలకు అణు ముసాయిదా గురించి ఒప్పించడంలో కాస్త పురోగతి ఏర్పడిందని అమెరికా విదేశీ శాఖ సహాయ కార్యదర్శి విలియం బర్న్స్ విలేఖరులకు తెలిపారు.
మరిన్ని
పాక్‌లో సైనిక చర్యలు అవాస్తవం: నాటో
అమెరికా ఏకపక్ష దాడి ఉల్లంఘనే: పాక్
అణు పరీక్షలు జరిపితే ఇంధనం కట్: అమెరికా
ఎన్ఎస్‌జి కీలక సమావేశం నేడే
తీవ్రవాదుల దాడి నుంచి తప్పించుకున్న గిలానీ
థాయ్‌ రాజధాని బ్యాంకాగ్‌లో ఎమర్జెనీ