ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > అంతర్జాతీయ > అణు ఒప్పందంలో కీలక పత్రాలు దాయలేదు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అణు ఒప్పందంలో కీలక పత్రాలు దాయలేదు
అణు పరీక్షలు జరిపినట్లయితే భారత్‌కు తక్షణమే అణు ఇంధన సరఫరాను నిలిపివేస్తామని చెబుతున్న కీలక పత్రాలను దాచి ఉంచినట్లుగా వచ్చిన ఆరోపణలను అమెరికా తోసిపుచ్చింది. అణు పరీక్షలపై నిషేధానికి భారత్ ఆమోదించినందున భారత ప్రభుత్వం పాటించవలసిన విధి విధానాలు ఈ ఒప్పందంలో చాలా స్పష్టంగా ఉన్నాయని అమెరికా స్పష్టం చేసింది.

123 ఒప్పందం ప్రకారం భారత్ పాటించవలసిన విధులు చాలా స్పష్టంగా ఉండటమే కాక, అణు పరీక్షలపై నిషేధానికి కూడా భారతీయులు అంగీకరించారని అమెరికా విదేశీ శాఖ ప్రతినిథి రాబర్ట్ ఉడ్ పేర్కొన్నారు. ఈ ఒప్పందంలో అంగీకరించిన మేరకు భారతీయులు వారి నిబద్ధతకు కట్టుబడతారని తాము భావిస్తున్నట్లుగా ఉడ్ చెప్పారు.

అణు పరీక్షకు సంబంధించి అమెరికా అభిప్రాయాల గురించి భారతీయులు అర్థంచేసుకున్నారని ఉడ్ తెలిపారు. తాము వారికి చాలా స్పష్టంగా ఈ విషయాన్ని వివరించామని, వారికి ఈ అంశంలో పూర్తి అవగాహన ఉందని చెప్పారు. ఇందుకు సంబంధించి తాము దాచిపెట్టిందేమీ లేదని, భారత ప్రభుత్వాన్ని కాపాడే ఉద్దేశంతో కీలక పత్రాలను తాము దాచి ఉంచినట్లు వచ్చిన వార్తలు సత్యదూరమని తోసిపుచ్చారు.

భారత్‌-అమెరికా మధ్య కుదిరిన 123 ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం చూస్తే భారత్ అణు పరీక్షలు జరిపినట్లయితే కొన్ని రంగాల్లో అణు సహకారం నిలిపివేస్తామని అమెరికా చెప్పినట్లుగా ఉంది. అయితే అలాంటి పరిస్థితుల్లోనూ ఇతర దేశాలనుంచి అణు ఇంధన సరఫరాను భారత్‌ నిరంతరాయంగా అందుకునేలా చేస్తామని అమెరికా హామీ ఇచ్చినట్లుగా ఇంతవరకు ప్రచారం జరుగుతూ వస్తోంది.

అణు సరఫరాదారుల బృందం వియన్నాలో గురువారం సమావేశమవుతుండగా తలెత్తిన వివాదాల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం 9 నెలలక్రితం రూపొందించిన ఓ అధికారిక పత్రం బుధవారం బహిర్గతమైంది. భారత్-అమెరికా అణు ఒప్పందం యొక్క కీలక నిబంధనలపై మొదటినుంచి భారత ప్రభుత్వం తనదైన వ్యాఖ్యానాలు చేస్తూ వస్తున్నప్పటికీ ఈ ఒప్పందం అసలు రూపం 9 నెలల తర్వాత ఇప్పుడు బయటపడటంతో భారత్‌లో గగ్గోలు బయలు దేరింది.
మరిన్ని
అణు సరఫరా దేశాల భేటీలో పురోగతి
పాక్‌లో సైనిక చర్యలు అవాస్తవం: నాటో
అమెరికా ఏకపక్ష దాడి ఉల్లంఘనే: పాక్
అణు పరీక్షలు జరిపితే ఇంధనం కట్: అమెరికా
ఎన్ఎస్‌జి కీలక సమావేశం నేడే
తీవ్రవాదుల దాడి నుంచి తప్పించుకున్న గిలానీ