ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > అంతర్జాతీయ > ఉగ్రవాద బాధితులకు ప్రత్యేక నిధి: జర్దారి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఉగ్రవాద బాధితులకు ప్రత్యేక నిధి: జర్దారి
ప్రపంచ ఉగ్రవాదులకు పాకిస్తాన్ అతి పెద్ద లక్ష్యంగా మారినందున దేశంలో ఉగ్రవాదంచే బాధితులైన వారికి ప్రత్యేక నిధిని ఏర్పర్చాలని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కో ఛైర్మన్ అసిఫ్ జర్దారీ పేర్కొన్నారు. దేశాధ్యక్ష పదవికి ఈ నెలల జరిగే ఎన్నికల్లో జర్దారీయే గెలుపుగుర్రంగా మారనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో పిపిపి నేత ఈ ప్రకటన చేశారు.

వీలైనంత త్వరగా ఇటువంటి ప్రత్యేక నిధిని పాక్ ప్రభుత్వం ఏర్పర్చాలని జర్దారీ కోరారు. తమ జాతి ప్రపంచ ఉగ్రవాద శక్తులకు అతిపెద్ద లక్ష్యంగా మారిందని చెప్పారు. అయితే దురదృష్టవశాత్తూ గ్లోబల్ టెర్రరిజంపై చర్చలు జరిగే ప్రతిసారీ ఉగ్రవాదంపై పోరులో పాక్ స్థానం ఏది అనే ప్రశ్నే వస్తోంది తప్ప ఆ ఉగ్రవాదంపై ధాటికి గురైన బాధితుల గురించి అందరూ విస్మరిస్తున్నారని జర్దారీ వాపోయారు.

అందుకని పాకిస్తాన్ ప్రభుత్వం తక్షణమే ఉగ్రవాద బాధితుల సహాయార్థం ఒక ప్రత్యేక ఫండ్ ఏర్పర్చాలని జర్దారీ అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదుల దాడుల్లో దెబ్బతిన్న కుటుంబాలకు, వారి పిల్లల రక్షణకు బాసటగా నిలిచి ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ఇచ్చే దిశగా ఈ ప్రత్యేక నిధి తోడ్పడాలని జర్దారీ ఆకాక్షించారు.

ఉగ్రవాదంపై యుద్దం పాశ్చాత్య దేశాల యుద్దం కాదని అది మన యుద్ధం కూడా అని జర్దారీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
మరిన్ని
పాక్‌తో బంధం ఎన్నటికీ మాయనిది: అమెరికా
అణు ఒప్పందంలో కీలక పత్రాలు దాయలేదు
అణు సరఫరా దేశాల భేటీలో పురోగతి
పాక్‌లో సైనిక చర్యలు అవాస్తవం: నాటో
అమెరికా ఏకపక్ష దాడి ఉల్లంఘనే: పాక్
అణు పరీక్షలు జరిపితే ఇంధనం కట్: అమెరికా