ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > అంతర్జాతీయ > పాక్‌పై బారక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పాక్‌పై బారక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు
FileFILE
అగ్రదేశం అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డెమొక్రటిక్‌ అభ్యర్థి బరాక్‌ ఒబామా సంచలన వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాద కార్యకలాపాల అణచివేత కోసం పాకిస్థాన్‌కు అమెరికా అందజేస్తున్న నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా భారత్‌పై యుద్ధం చేసేందుకే పాకిస్థాన్ ఈ నిధులను వినియోగిస్తున్నట్టు బారక్ ఒబామా సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు.

తాము అధికారంలోకి వస్తే నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేస్తామని ఆయన ప్రకటించారు. శుక్రవారం ఆయన ఒక ప్రైవేట్ టెలివిజన్ ఛానల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. నానాటికీ పెరిగి పోతున్న ఉగ్రవాదాన్ని అణచి వేసేందుకు పాకిస్థాన్‌కు అమెరికా ప్రభుత్వం భారీ ఎత్తున ఆర్థిక, సైనిక సాయం అందిస్తోంద్నారు. ఇందులోభాగంగా ఇప్పటికే సుమారుగా వేయి కోట్ల డాలర్లు (40 వేల కోట్ల రూపాయలు) మేరకు అందజేసినట్టు చెప్పారు.

కానీ ఈ నిధులు సక్రమ మార్గంలో ఖర్చు కాలేదన్నారు. ముఖ్యంగా అమెరికా అందిస్తున్న నిధులను భారత్‌పై యుద్ధం చేసేందుకు పాకిస్థాన్ వినియోగిస్తుందని ఆరోపించారు. పాక్ అధ్యక్షుడిగా ఉన్న పర్వేజ్ ముషారఫ్ ఎలాంటి జవాబుదారీతనం లేకుండా నిధులను దుర్వినియోగ పరిచారని ఒబామా పేర్కొన్నారు.

తాను అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారంలోకి వస్తే రాగానే పాక్‌ నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేస్తానని ఒబామా స్పష్టం చేశారు. అలాగే ఆఫ్గనిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసేలా పాక్‌ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని ఆయన ప్రకటించారు.
మరిన్ని
నేడు పాకిస్థాన్ దేశాధ్యక్ష ఎన్నికలు
ఉగ్రవాద బాధితులకు ప్రత్యేక నిధి: జర్దారి
పాక్‌తో బంధం ఎన్నటికీ మాయనిది: అమెరికా
అణు ఒప్పందంలో కీలక పత్రాలు దాయలేదు
అణు సరఫరా దేశాల భేటీలో పురోగతి
పాక్‌లో సైనిక చర్యలు అవాస్తవం: నాటో