ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పాకిస్తాన్ అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ నేడు ప్రారంభం అయిన క్షణాల్లో అందరి మనసుల్లోనూ రెండు విషయాలు గుర్తుకొస్తున్నాయని పాక్ పత్రికలు వ్యాఖ్యానించాయి. అవేమిటంటే.. ఇంతవరకు పాక్ చరిత్రలో ఒక మహిళ దేశాధ్యక్షురాలిగా నియమించబడకపోవడం, పాకిస్తాన్‌లోని నాలుగు ముఖ్య ప్రాంతాలలో ఒకటయిన బలూచిస్తాన్ నుంచి ఇంతవరకు ఏ ఒక్కరికీ అధ్యక్ష పదవి దక్కకపోవటం.
పాక్ చరిత్రలో ఇంతవరకూ 10 మంది అధ్యక్షులు, నలుగులు గవర్నర్ జవర్నల్స్ నియమించబడగా, వీరిలో 6గురు పంజాబ్ ప్రాంతానికి చెందినవారు కాగా, మరో ఆరుగురు సింధ్ ప్రాంతం నుంచి, మిగిలిన ఇద్దరు వాయవ్య సరిహద్దు ప్రాతం నుంచి వచ్చిన వారు కాగా, బలూచిస్తాన్‌కు చెందినవారు ఇంతవరకు ఈ పదవులలో లేకపోవడం గమనార్హమని డైలీ టైమ్స్ పేర్కొంది. తెగల వారీగా చూస్తే పఠాన్ తెగకు చెందిన వారు నలుగురు ఈ కీలకపదవులను సాధించగా ముగ్గురు సయ్యద్‌లు, ఇద్దరు అరియన్‌లు, రాజపుట్, కాశ్మీరీ, గుజ్జర్, జాట్, బలూచ్ -లెఘారీ-తెగలకు చెందిన ఒక్కొక్కరికి ఈ అవకాశం దక్కింది. మొత్తంమీద వీరిలో నలుగురు సైనిక నియంతలని పాక్ పత్రిక తెలిపింది.
పాకిస్తాన్‌లో అయిదేళ్ల పూర్తికాలాన్ని ముగించుకున్న దేశాధ్యక్షులు ముగ్గురే కాగా వారిలో పర్వేజ్ ముషారఫ్ మూడోవారు కావడం గమనార్హం.
|