ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > అంతర్జాతీయ > పెషావర్‌లో బాంబు పేలుడు: 12 మంది మృతి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పెషావర్‌లో బాంబు పేలుడు: 12 మంది మృతి
పాకిస్తాన్ వాయవ్య ప్రాంత నగరమైన పెషావర్ శివార్లలోని గస్తీ కేంద్రంపై శనివారం జరిగిన ఆత్మాహుతి కార్ బాంబు దాడిలో కనీసం 12 మంది మృతి చెందగా మరో 40 మంది పేలుడులో గాయపడ్డారు. పెషావర్‌లోని బదాబెర్ ఏరియాలోని చెక్‌పోస్ట్‌పై జరిగిన బాంబు దాడిలో గస్తీ కేంద్రం పూర్తిగా ధ్వంసమైపోయిందని పోలీస్ అధికారి మహమ్మద్ సులేమాన్ నిర్ధారించారు.

ఈ పేలుడు ధాటికి గస్తీ కేంద్రం సమీపంలో ఉన్న రెండు మార్కెట్లతో పాటు 15 వాహనాలు కూడా దెబ్బతిన్నాయని అధికారులు చెప్పారు. బాంబు దాడి ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే, పేలుడులో చిక్కిన శరీరాలు 50 మీటర్ల దూరం ఎగిరిపడ్డాయని తెలిపారు. పేలుడు జరిగిన ప్రాంతంలో పెద్ద గుంట ఏర్పడిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

ఈ పేలుడులో గాయపడిన వారిని పెషావర్ నగరంలోని లేడీ రీడింగ్ హాస్పిటల్‌కు తరలించారు. కాగా, ఈ దాడికి తామే కారణమని ఇంతవరకూ ఏ సంస్థా ప్రకటించలేదు. పాకిస్తాన్ నూతన దేశాధ్యక్షుడి ఎన్నికలలో భాగంగా రాష్ట్రాల శాసన సభ్యులు, పార్లమెంటేరియన్లు పోలింగ్‌లో పాల్గొంటున్న సందర్భంగా ఆత్మాహుతి దాడి జరిగింది.
మరిన్ని
అధ్యక్ష పీఠంలో స్థానం లేని పాక్ మహిళ
నేడే అణు ఇంధన దేశాల తాజా చర్చలు
ఎన్‌ఎస్‌జి‌లో పురోగతి తెచ్చిన ప్రణబ్ ప్రకటన
పాక్‌పై బారక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు
నేడు పాకిస్థాన్ దేశాధ్యక్ష ఎన్నికలు
ఉగ్రవాద బాధితులకు ప్రత్యేక నిధి: జర్దారి