ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > అంతర్జాతీయ > భారత్‌కు అణు మినహాయింపు: ఎన్ఎస్‌జీ ఆమోదం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
భారత్‌కు అణు మినహాయింపు: ఎన్ఎస్‌జీ ఆమోదం
అంతర్జాతీయ అణు భద్రతా ప్రమాణాల ఒప్పందం ముసాయిదానుంచి భారత్‌కు మినహాయింపులు ఇచ్చేందుకు అణు సరఫరా దేశాల కూటమి ఎట్టకేలకు ఆమోద ముద్రవేసింది. దీంతో సంవత్సర కాలంగా వివాదాస్పదంగా మారిన భారత్-అమెరికా పౌర అణుఒప్పందానికి అడ్డంకులు తొలగిపోయాయి. శనివారం ఆస్ట్రియా రాజధాని వియన్నాలో అణు సరఫరా దేశాల కూటమి తాజాగా జరిపిన సమావేశంలో ఈ మేరకు కూటమిలోని 45 దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.

ఎన్ఎస్‌జి దేశాలు భారత్‌కు మినహాయింపులు ఇచ్చేందుకు అంగీకారం తెలిపిన వెంటనే ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్ భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఫోన్ చేశారు. కాగా ఎన్ఎస్‌జి నుంచి మన దేశం మినహాయింపులు పొందడం నిజంగా భారత్‌కు చారిత్రక విజయమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

దశాబ్దాలుగా అనుభవిస్తున్న అణు ఏకాకితనం నుంచి బయటపడేందుకు భారత్ సంవత్సర కాలంగా చేస్తున్న తీవ్రప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. చివరివరకు భారత్‌కు మినహాయింపు ఇవ్వడానికి తీవ్ర వ్యతిరేకత తెలుపుతూ వచ్చిన చైనా, ఆస్ట్రియా, న్యూజిలాండ్, ఐర్లండ్ దేశాలను ఎట్టకేలకు ఒప్పించడంలో భారత్ విజయం సాధించింది. అణు సంపన్న దేశాల సరసన నిలబడాలన్న భారత్ ఆకాంక్షలపై అడ్డుకట్టలు వేసేందుకు ఈ నాలుగు దేశాలు చివరి వరకు గట్టిగా ప్రయత్నించాయి.

చివరకు అత్యున్నత స్థాయిలో చర్చలు జరిగిన తర్వాత భారత్‌కు అనుకూలంగా ఎన్ఎస్‌జి దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఏకాభిప్రాయ సాధన క్రమంలో అమెరికా అధ్యక్షుడు బుష్ చివరి క్షణంలో చైనా అధ్యక్షుడు హూ జింటావోతో సంభాషించారు. దీంతో పట్టుసడలించిన పై నాలుగు దేశాల్లో ఆస్ట్రియా ముందుగా ముసాయిదాకు ఆమోదం తెలిపింది.

మొదటినుంచి ఈ విషయంపై పట్టుదలతో ఉన్న ఆస్ట్రియా తన వైఖరి మార్చుకోగానే ఇతర దేశాలు తమ పట్టు సడలించాయి.
అణు పరీక్షలపై తాము స్వచ్ఛందంగా నిషేధం విధించుకున్నామని భారత విదేశీ మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రకటించిన తర్వాతే ఎన్‌ఎస్‌జి దేశాలతో ఒప్పందాన్ని భారత్ విజయవంతంగా ముగించగలిగిందని పరిశీలకుల వ్యాఖ్య.
మరిన్ని
పాక్ అధ్యక్ష ఎన్నికల్లో జర్దారీ గెలుపు
పెషావర్‌లో బాంబు పేలుడు: 12 మంది మృతి
అధ్యక్ష పీఠంలో స్థానం లేని పాక్ మహిళ
నేడే అణు ఇంధన దేశాల తాజా చర్చలు
ఎన్‌ఎస్‌జి‌లో పురోగతి తెచ్చిన ప్రణబ్ ప్రకటన
పాక్‌పై బారక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు