సుమారు 34 సంవత్సరాల తర్వాత భారత్ అణు వాణిజ్యానికి ద్వారాలు తెరచుకున్నాయి. భారత్ తొలి అణు పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రపంచ దేశాలు అణు వాణిజ్యం చేయడానికి నిరాకరించాయి. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్నప్పటికీ.. అణు వ్యాపారంలో మాత్రం భారత్ ఏకాకిగానే వుంటూ వచ్చింది. ఈ కాలక్రమంలో భారత్-అమెరికా దేశాల మధ్య అణు పౌర ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో కీలకఘట్టాలను ఒకసారి పరిశీలిస్తే...!
1968:- ఎన్.పి.టి.పిపై సంతకానికి భారత్ నిరాకరణ. 1974 మే 18:- భారత్ తొలి అణు పరీక్ష. 1978 మార్చి 10:- ఎన్‌పీటీపై జిమ్మీ కార్టర్ సంతకం. 1998 మే 11-13:- ఐదు భూగర్భ అణు పరీక్షలు నిర్వహించిన భారత్. 2005:- అణు ఒప్పందానికి అనుకూలంగా బుష్, మన్మోహన్ సింగ్ సంయుక్త ప్రకటన. 2006 నవంబర్ 16:- అణు సహకారంపై రూపొందించిన హైడ్ చట్టం - 2006కు అమెరికా కాంగ్రెస్ ఆమోదం. 2008 మార్చి 3:- ఒప్పందంపై ముందడగు వేస్తే మద్దతు ఉపసంహరిస్తామని లెఫ్ట్ హెచ్చరిక.
2008 జూలై 8:- కేంద్ర ప్రభుత్వానికి లెఫ్ట్ పార్టీల మద్దతు ఉపసంహరణ. 2008 జూలై 22:- లోక్‌సభలో విశ్వాస పరీక్ష నెగ్గిన యూపీఏ. 2008 సెప్టెంబర్ 3:- భారత్ అణ్వస్త్ర పరీక్షలు జరిపితే అణు పరిజ్ఞానాన్ని అందించడం నిలిపివేస్తామంటూ జార్జిబుష్ రాసిన లేఖ వెలుగులోకి. 2008 సెప్టెంబర్ 6:- అణు రంగంలో 34 ఏళ్ల అంతర్జాతీయ ఏకాకితనం నుంచి దూరం చేస్తూ భారత్‌కు చారిత్రాత్మక మినహాయింపు ఇచ్చిన అణు ఇంధన సరఫరా దేశాల కూటమి (ఎన్‌ఎస్‌జీ) కీలక నిర్ణయం.
|