అణు వాణిజ్యం నిర్వహించేందుకు ఎన్‌ఎస్‌జి నుంచి చారిత్రాత్మక మినహాయింపును సాధించిన నేపథ్యంలో పౌర అణు ఒప్పందానికి అమెరికా కాంగ్రెస్‌చే ఆమోదముద్ర వేయించే ప్రక్రియను ఆ దేశ అధ్యక్షుడు జార్జి బుష్ యంత్రాంగం ఎలా పూర్తి చేయిస్తుందనే అశం ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
పౌర అణు ఒప్పందం ఆమోదంపై చర్చలను తాను సోమ లేదా మంగళ వారాల్లో మొదలు పెడతానని అమెరికా విదేశీ శాఖ మంత్రి కాండోలీజా రైస్ పేర్కొన్నారు. ఈ విషయమై భారతీయ అమెరికన్ కమ్యూనిటీ నుంచి కాంగ్రెస్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. హైడ్ చట్టం నిబంధనలను సులభంగా అధిగమించడంలో కీలక పాత్ర పోషించిన భారతీయ అమెరికన్ కమ్యూనిటీ, రాజకీయ సంకల్పం ఉంటే వాషింగ్టన్ ప్రభుత్వం సాధించలేనిది అంటూ ఉండదని గుర్తు చేసుకుంటోంది.
హైడ్ చట్టానికి అనుకూలంగా వోట్ చేయడంలో కీలకపాత్ర పోషించిన టెక్సాస్‌కు చెందిన సీనియర్ ఇండియన్ కమ్యూనిటీ నేత ప్రస్తుత పరిణామాల రీత్యా హైడ్ చట్టానికి మినహాయింపులు చేయవలసిన అవసరం గురించి ఆలోచించాలని హౌస్ విదేశీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ హోవార్డ్ బెర్మన్‌కు పిలుపిచ్చారు.
హైడ్ చట్టాన్ని సమర్థించిన హైడ్ అణు నిరాయుధీకరణ అంశంపై కఠిన వైఖరిని అవలంబించారు. అయితే అమెరికా యంత్రాంగం నిబంధనలను నిర్ణీత గడువు వరకు మార్చాలని కోరుకున్నట్లయితే పౌర అణు ఒప్పందం హైడ్ చట్టంతో పూర్తిగా ఏకీభవించేలా మార్పులను చేయవచ్చని సంకేతం పంపారు.
ఎన్ఎస్‌జి దేశాలే భారత్‌కు అణు మినహాయింపు ఇచ్చిన నేపథ్యంలో హైడ్ చట్ట నిబంధనలను కూడా మినహాయించడానికి సమయం ఆసన్నమైందని యుఎస్ ఇండో ఫోరమ్ ఛైర్మన్ అశోక్ మాగు అభిప్రాయం వ్యక్తం చేశారు.
|