ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ లక్ష్యంగా శ్రీలంక త్రివిధ దళాలు కిలినోచ్చిలో గాలింపు సాగుతోంది. ఎల్టీటీఈ రాజకీయ కేంద్రంగా పరిగణించే కిలినోచ్చిని శ్రీలంక సైనికులు కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ విజయంతో సైనికులు ముందుకు సాగిపోతున్నారు. అలాగే లంక త్రివిధ దళాలు దాడులను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే లంక టైగర్లకు మంచి పట్టు ఉన్న పలు ప్రాంతాలను కైవసం చేసుకుని విజయోత్సాహంతో ముందుకు సాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభాకరన్‌ను ప్రాణాలతోగానీ నిర్జీవంగా గానీ పట్టుకోవాలనే లక్ష్యంతో సైనికులు తమ పనిలో నిమగ్నమైవున్నారు. అయితే పెద్దపులి భూమి లోపల 30 అడుగుల బంకర్‌లో దాగి ఉన్నట్టు సమాచారం. ఈ బంకర్‌ను కనుగొనే పనిలో లంక సైన్యం మునిగి ఉంది. కాగా, తాజాగా జరిగిన ముప్పేట దాడుల్లో పలువురు ఎల్టీటీఈ తీవ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. లంక యుద్ధ విమానాలు ఎల్టీటీఈ స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. |