తమ దేశంలో శాంతి భద్రతలకు భంగం కలిగించారనే ఆరోపణల కింద అరెస్టు చేసిన హిందూ రైట్స్ యాక్షన్ ఫోరమ్ (హిండ్రాఫ్) నేతలను విడుదల చేయబోమని మలేషియా ప్రభుత్వం తేల్చి చెప్పింది. మలేషియాలో నివశిస్తున్న ప్రవాస భారతీయులు తమకు కూడా మలేషియా పౌరులకు సమానంగా హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా రాజకీయ, ఉద్యోగ, సాంఘిక రంగాల్లో కనీస ప్రాతినిథ్యం ఇవ్వాలని హిండ్రాఫ్ నాయకులు కొంత కాలంగా పోరాడుతుండగా వీరిని అరెస్టు చేసి జైలుకు పంపారు.
ప్రతి ఆరు నెలలకు ఒకసారి జరిగే సమీక్ష బోర్డులో ఈ అంశాన్ని పరిశీస్తామని, కమిటీ సిఫార్సు చేస్తేనే వీరిని విడుదల చేసే అవకాశముందని భారత్‌లో పర్యటిస్తున్న మలేసియా మానవ వనరుల మంత్రి ఎస్.సుబ్రమణియన్ స్పష్టం చేశారు. హిండ్రాఫ్ నేతల అరెస్టు గతంలో ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైన విషయం తెల్సిందే. |