ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > అంతర్జాతీయ > ముల్లైతీవులో భీకర పోరు: 40 మంది సైనికుల బలి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ముల్లైతీవులో భీకర పోరు: 40 మంది సైనికుల బలి
FILE
తమ చిట్ట చివరి స్థావరాన్ని నిలుపుకునేందుకోసం తీవ్రంగా పోరాడుతున్న తమిళ టైగర్ల తిరుగుబాటుదారులు సోమవారం 40మంది సైనికులను బలిగొన్నట్లు ప్రకటించారు. ముల్లైతీవు ఉత్తర ప్రాంతంలో టైగర్ల స్థావరాలను పట్టుకునేందుకు లంక సైనిక బలగాలు మోహరించి ఉన్నాయి.

అయితే తమ బలగాలకు భారీ నష్టం సంభవించినట్లుగా వచ్చిన వార్తలను లంక అధికారులు తోసిపుచ్చారు. ముల్లైతీవు పట్టణం వేపుగా పురోగమించడానికి లంక సైన్యం చేసిన ప్రయత్నాలను తాము అడ్డుకున్నామని ఈ పోరులో 80మంది లంక సైనికులు గాయపడ్డారని టైగర్ల వెబ్‌సైట్ పేర్కొంది.

స్వపక్షం భారీగా దెబ్బతినడంతో లంక సైనికులు ముందుకు రాకుండా ఆగిపోయారని టైగర్ల వెబ్‌సైట్ చెప్పింది. ఈలోగా, లంక బలగాలు కిలినోచ్చిని హస్తగతం చేసుకున్న తర్వాత వ్యూహాత్మకంగా కీలకమైన ఒడ్డుసుదన్ పట్టణంలో ప్రవేశించాయి. ఇది ముల్లైత్తీవు వైపుగా వెళ్లే ప్రధాన రహదారి కావడం వల్ల టైగర్లు దీన్ని సరకుల రవాణాకు, పాలనాపరమైన అవసరాలకు వాడుకునే వారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ప్రభాకరన్ అప్పగింతపై నిర్ణయించుకోలేదు
పాక్ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి
గాజాపై దాడుల కొనసాగింపు : 510మంది మృతి
బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా జిల్లూర్ రహ్మాన్?
హిండ్రాఫ్‌ నేతల విడుదలకు మలేషియా ససేమిరా
గాజాపై దాడులు తక్షణం ఆపాలి: ఐరాస