ముంబై దాడుల నిందితులను అప్పగించేందుకు భారత్ అందజేసిన సాక్ష్యాధారాలు అసంపూర్ణంగా ఉన్నాయని పాకిస్తాన్ ప్రభుత్వం పేర్కొంది. భారత్ సాక్ష్యాధారాల ప్రాతిపదిక ఈ విషయంలో తగిన చర్య తీసుకోలేమని చెప్పింది. భారత్ ఇచ్చిన సాక్ష్యాలపై ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా నివేదిక పంపించనున్నట్లు పాక్ వెల్లడించింది.ఒక మాటలో చెప్పాలంచే భారత్ సాక్ష్యాధారాలను పాక్ కొట్టి పడేసింది. ఇందుకు మూడు కారణాలను అది చూపిస్తోంది. ఒకటి. కసబ్ నిర్బంధంలో చిత్రహింసలకు గురవుతున్న సమయంలో చెప్పిన సాక్ష్యం చట్టపరంగా చెల్లదు. రెండు. ఆయుధాలు, మేడిన్ పాకిస్తాన్ పదార్ధాలను ఉగ్రవాదులనుంచే పట్టుకున్నారనేందుకు ఆధారాలు లేవు. భారత్ ఇచ్చిన సాక్ష్యాధారాలలో కొత్తదనం లేదని, ఇవన్నీ ఇప్పటికే భారత్ మీడియాలో వచ్చేశాయని, ఈ కారణంగా వాటిని తిరస్కరిస్తున్నామని పాక్ పేర్కొంది. మరోవైపున పదే పదే పాతపాటే పాడుతున్న పాక్ తమ దేశంలో ఉగ్రవాదాన్ని భారతే పెంచి పోషిస్తోందంటూ రాగం మార్చింది. ఈ మేరకు పాక్ తన వంతుగా ఓ నివేదికను తయారు చేస్తున్నట్లుగా సమాచారం.ముంబై దాడుల సందర్భంగా పట్టుబడిన ఏకైక ఉగ్రవాది కసబ్ వాంగ్మూలంతో పాటు, పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబా నేతలతో జీపీఎస్, శాటిలైట్ ఫోన్ ద్వారా ఉగ్రవాదులు జరిపిన సంభాషణల ఆధారాలను పాక్‌కు అందజేషిన విషయం తెలిసిందే. |