బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా అవామీ లీగ్ అధ్యక్షురాలు షేక్ హసీనా మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. బంగ భవన్‌లో బంగ్లాదేశ్ అధ్యక్షుడు లాజుద్దీన్ అహ్మద్ షేక్ హసీనాతో ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం 23 మంది మంత్రులు, 8 మంది సహాయ మంత్రులు ప్రమాణం చేశారు. ఇదిలావుండగా బీఎన్‌పీ అధ్యక్షురాలు ఖలీదా జియా హాజరు కాలేదు. కాని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ఎంకె అన్వర్‌తో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
కాగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని హసీనా మట్లాడుతూ పొరుగు దేశమైన భారత్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తామని, ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు తమ సహకారం భారత్‌కు ఎప్పుడూవుంటుందని తెలిపారు. |