ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > అంతర్జాతీయ > ఆ ఉద్దేశం భారత్‌కు లేదు: ప్రణబ్ స్పష్టం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆ ఉద్దేశం భారత్‌కు లేదు: ప్రణబ్ స్పష్టం
పాలస్తీనా తరహాలో పాకిస్తాన్‌పై దాడులు చేసే ఉద్దేశం భారత్‌కు లేదని దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య ఉన్న పరిస్థితులు వేరని ప్రణబ్ పేర్కొన్నారు. పాలస్తీనా-ఇజ్రాయెల్ సమస్యను.. భారత్-పాక్‌లతో సరిపోల్చమని ప్రణబ్ వెల్లడించారు.

పాక్ భూభాగంపై దాడి చేసి ఆక్రమించాలన్న ఉద్దేశం భారత్‌కు లేదని ప్రణబ్ తేల్చి చెప్పారు. అయితే ఉగ్రవాదంపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆయన తెలిపారు. పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయాలన్నదే తమ అభిమతమని ప్రణబ్ పేర్కొన్నారు. ఉగ్రవాద శిబిరాల దాడిపై పాక్ జాప్యం చేయడం ఏ మాత్రం సరికాదని తెలిపిన ప్రణబ్, పాక్ వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు. భారత వాణిజ్య నగరమైన ముంబై దాడి పాక్ కేంద్రంగానే జరిగిందని ప్రణబ్ తెలిపారు.

ఇదిలా ఉండగా... ముంబై దాడులకు సంబంధించి భారత్ సమర్పించిన ఆధారాలపై పాకిస్తాన్ నుంచి ఎలాంటి స్పందన లభించలేదని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఆనంద్ శర్మ శనివారం విలేకరులతో చెప్పారు. పాకిస్తాన్ నుంచి అందనున్న సమాచారం మేరకే భారత్ ముంబై దాడులపై తగిన చర్యలు తీసుకోనుందని ఆనంద్ శర్మ అన్నారు. పాక్ అందజేయనున్న సమాచారం కోసం విదేశాంగ శాఖ వేచి ఉందని ఆనంద్ శర్మ స్పష్టం చేశారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
గాజాలో తక్షణం కాల్పుల విరమణ : ఐరాస
లంక సైన్యం చేతికి టైగర్ల "ఎలిఫెంట్‌ పాస్‌"
కాల్పుల ఒప్పందానికి ఐరాసలో తీర్మానం
పాకిస్థాన్‌కు చేరుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు
పదవి నుంచి తొలగించడం అన్యాయం: దురానీ
ఒబామాకు విదేశీ తలనొప్పి.. పాక్ : హాడ్లీ