ఏ సమయంలోనైనా టిబెట్‌లో హింసాత్మకమైన సంఘటనలు చెలరేగవచ్చని టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా తెలిపారు. నిరుడు ఆ దేశ రాజధాని ల్హాసాలో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆయన పై విషయాన్ని ప్రజలకు గుర్తు చేశారు.
గతంలో జరిగిన హింసలో దాదాపు 19మంది మృతి చెందారని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా అధిక మొత్తంలో గాయాల పాలైనట్లు వారు తెలిపారు. రానున్న రోజులలో ఏ వైపునుంచి దాడులు జురుగుతాయో అంచనా వేయలేకున్నామని దలైలామా అన్నట్లు వారు పేర్కొన్నారు.
ఇదిలావుండగా టిబెట్ గవర్నర్ కియాంగ్‌బా పుంకోగ్ తో సహా చైనాలోని ఇతర అధికారులు దలైలామా మాటలను వారు ఖండించారు. వార్షికోత్సవాలను జరుపుకునేముందు భద్రతా దళాధికారులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తారని, గతంలో జరిగిన తప్పులు మరోసారి జరగడానికి వీలులేదని వారు పేర్కొన్నారు. దలైలామా చెప్పినట్లు హింసాత్మక సంఘటనలు చెలరేగడానికి ఆస్కారం లేదని అధికారవర్గాలు స్పష్టం చేశాయి.
గత నెలలో పోలీసువర్గాలు టిబెట్లోని ఓ వంతెన క్రింద దాచిపెట్టబడిన విస్ఫోటకాన్ని ఛేదించారని వారు తెలిపారు. టిబెట్ లోని పేయిచింగ్ వర్గాలు దలైలామాను వేరుగు చూస్తున్నాయని కాబట్టి వారు టిబెట్‌లో హింసాత్మక సంఘటనలకు పాల్పడుతారని ఆయన వారిపై అనుమానం వ్యక్తం చేసినట్లు అధికారులు వివరించారు. |