ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > అంతర్జాతీయ > అంతర్జాతీయ మహిళలకు కొత్త శాఖ: ఒబామా
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అంతర్జాతీయ మహిళలకు కొత్త శాఖ: ఒబామా
FILE
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారి సంక్షేమార్థం ఓ నూతన విదేశాంగ పదవిని ఏర్పాటు చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ హుస్సేన్ ఒబామ తెలిపారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ హయాంలో పనిచేసిన మిలెన్‌ విర్వెర్‌కు ఈ బాధ్యతలు అప్పగించనున్నట్లు ఒబామ పేర్కొన్నారు.

విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్‌కు సహకరిస్తూనే విర్విర్‌ ఈ పదవికి సేవలందిస్తారని వైట్‌‌హౌస్‌ తెలిపింది. మిలెన్ విర్వెర్‌ మహిళల కోసం పనిచేసే ఓ స్వచ్ఛంధ సంస్థ నిర్వాహకురాలు కావడం గమనార్హం. దీంతో అంతర్జాతీయ మహిళా సమాఖ్య సభ్యురాళ్ళు హర్షం ప్రకటించారు.

దీంతో ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను ఆలోచించి వాటికి కావాల్సిన చర్యలను చేపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ప్రతిరోజు 40వేల ఉత్తరాలు: ఒబామా
పాక్ బస్సు హీరో సోదరుడు ఓ జిహాదీ
టిబెట్‌లో మళ్ళీ హింస చెలరేగవచ్చు: దలైలామా
పాక్‌లో ఆత్మాహుతి దాడి: 8 మంది మృతి
పాక్‌కు అంతర్గత శత్రువుల ముప్పు: హిల్లరీ క్లింటన్
కారు ప్రమాదం: జింబాబ్వే ప్రధాని భార్య మృతి