ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > అంతర్జాతీయ > భారత్‌ను డీఎన్ఏ వివరాలు కోరిన ఇంటర్‌పోల్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
భారత్‌ను డీఎన్ఏ వివరాలు కోరిన ఇంటర్‌పోల్
ముంబయి ఉగ్రవాద దాడుల దర్యాప్తులో సేకరించిన డీఎన్ఏ వివరాలు తమకు అందజేయాలని ఆదివారం భారత్‌ను ఇంటర్‌పోల్ కోరింది. పాకిస్థాన్ ప్రభుత్వం కూడా గత ఏడాది నవంబరులో జరిగిన ముంబయి మారణహోమానికి సంబంధించి ఇటువంటి వివరాలనే ఇంటర్‌పోల్‌కు ఇచ్చేందుకు అంగీకరించింది.

ఇదిలా ఉంటే ముంబయి దాడుల నిర్వహణకు ఉగ్రవాద సంస్థలు సేకరించిన నిధులతో ఏడు దేశాలకు సంబంధం ఉందని ఇంటర్‌పోల్ చీఫ్ రొనాల్డ్ నోబెల్ వెల్లడించారు. భారత్‌తోపాటు యూరప్, మధ్యప్రాచ్య దేశాలతో ఈ నిధులకు సంబంధాలు ఉన్నాయన్నారు. అయితే దేశాల పేర్లు స్పష్టంగా వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.

మరోవైపు పాకిస్థాన్ ప్రభుత్వం కూడా తాము అడిగిన 30 ప్రశ్నలకు సమాధానాలను సాధ్యమైనంత త్వరగా అందజేయాలని భారత్‌కు విజ్ఞప్తి చేసింది. ముంబయి దాడులకు సంబంధించి జరుపుతున్న దర్యాప్తులో పాకిస్థాన్ ప్రభుత్వం నలుగురు అనుమానితులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరి రిమాండ్ ముగియడానికి 13 రోజుల మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో.. పాక్ తామడిగిన ప్రశ్నలకు సాధ్యమైనంత త్వరగా సమాధానాలు పంపాలని కోరింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
భుట్టో హత్య: ఎఫ్ఐఆర్ నమోదుకు షరీఫ్ డిమాండ్
పాక్‌లో ఉగ్రవాదాన్ని చట్టబద్ధం చేసే ప్రయత్నం
బంగ్లా రైఫిల్స్ తిరుగుబాటు: 150 మంది గుర్తింపు
లాహోర్ దాడి: న్యాయ విచారణకు ఆదేశం
కాశ్మీర్ సమస్య పరిష్కారానికి ఇదే అదను: ముష్
దర్యాప్తుకు పాక్ సహకరించాలి: ముషారఫ్