పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ దేశాలలో నెలకొన్న యుద్ధవాతావరణానికి సంబంధించి కొత్త యుద్ధ నీతిని రూపొందించినట్లు ఒబామా తెలిపారు.
అల్‌ఖైదా తీవ్రవాదులు ఏర్పరచుకున్న స్థావరాలు, అలాగే ఒసామా బిన్‌లాడెన్‌కు చెందిన స్థావరాలను ధ్వంసం చేయడానికి గల నిర్ణయాలు ప్రస్తుతం ప్రకటించబోయే కొత్త యుద్ధనీతిలోని ప్రధాన అంశాలని వైట్‌హౌస్ అధికారులు తెలిపారు.
ఆఫ్గనిస్థాన్‌కు ఈ ఏడాది దాదాపు నాలుగువేలమంది అదనపు బలగాలను పంపనున్నట్లు వారు తెలిపారు. వీరి పని ఆఫ్గన్ సైన్యానికి శిక్షణ ఇవ్వడమేనని, దీంతో వారు స్వతంత్రంగా ఉగ్రవాదులతో తలపడే విధంగా వారికి తర్ఫీదు ఇస్తారని అధికారవర్గాలు తెలిపాయి. |