పాకిస్థాన్‌లోని ఐఎస్ఐ సంస్థ తాలిబన్లు, అల్‌ఖైదాలాంటి తీవ్రవాదులుకు సహాయ సహకారాలు అందజేస్తోందని అమెరికా ప్రముఖ అధికారులు తెలిపారు. ఉగ్రవాదులను సమర్థించడం ఐఎస్ఐ మానుకోవాలని అమెరికా నావికాదళ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అడ్మిరల్ మైక్ ములేన్, సైన్యాధ్యక్షుడు జనరల్ డేవిడ్ పేట్రాయ్స్‌లు సంయుక్తంగా ప్రకటించారు.
ఆఫ్గనిస్థాన్‌లోని పశ్చిమ సరిహద్దు, భారతదేశంలోని తూర్పు సరిహద్దులలోనున్న ఉగ్రవాదులతో ఐఎస్ఐ సంబంధాలను కొనసాగిస్తోందని అడ్మిరల్ మైక్ ములేన్ పేర్కొన్నారు. ఇరుదేశాల్లోనున్న ఉగ్రవాదులకు ఐఎస్ఐ సహాయ సహకారాలను నిలిపివేయాలని ఆయన కోరారు. ఐఎస్ఐలోని ప్రముఖులు ఉగ్రవాద సంస్థలైన అల్‌ఖైదా, తాలిబన్లలోని తీవ్రవాదులకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు, వారంటే ఐఎస్ఐకి చాలా ప్రేమ కనబరుస్తుంటారని తమవద్ద సమాచారం ఉందని ఆయన స్పష్టం చేశారు. |