థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాగ్‌తో సహా, దాని పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఎమర్జెన్సీ విధించారు. పట్టయా ప్రొవియన్స్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులు జరుపుతున్న నిరసను రాజధానికి పాకాయి. ఫలితంగా.. ఆసియా సదస్సును రద్దు చేసిన 24 గంటల లోపే బ్యాంకాగ్‌లో ఎమర్జెన్సీని విధించడం గమనార్హం. ఈ విషయాన్ని స్థానిక టెలివిజన్ ఛానల్ పేర్కొంది.
ప్రభుత్వ వ్యతిరేక శక్తులను అదుపు చేసేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు ప్రధానమంత్రి అభిసిత్ వెజ్జాజీవ తెలిపారు. ఈ ప్రకటన వెలువడిన మరుక్షణంలో వందలాది మంది ప్రభుత్వ వ్యతిరేక శక్తులపై థాయ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. కాగా, ఆసియన్ సదస్సుకు అంతరాయం కలిగించేందుకు, నియంత పాలనకు వ్యతిరేకంగా యునైటెడ్ ఫ్రంట్ ఫర్ డెమొక్రసీకి చెందిన వేలాది మంది ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే.
దీంతో ఈనెల 10-12 తేదీల మధ్య జరగాల్సిన ఆసియన్ సదస్సును ప్రభుత్వం రద్దు చేసింది. ఇందులో భారత్ కూడా పాలు పంచుకోవాల్సి వుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు థాయ్‌కు బయలుదేరిన ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి, ఇండోనేషియా అధ్యక్షుడు అర్థాంతరంగా తిరిగి తమ దేశాలకు తిరుగు పయనమయ్యారు. |