పాకిస్థాన్ దేశం తాలిబన్లను తప్పక ఓడిస్తుందని పాకిస్థాన్ ప్రధానమంత్రి యూసుఫ్ రజా గిలానీ అన్నారు. కాని ఇలాంటి పరిస్థితులలో తాము వేలాది ప్రజలను కాపాడుకోకపోతే వారి మద్దతును కోల్పోతామని ఆయన తెలిపారు. గిలానీ జాతీయ అసెంబ్లీ సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తూ...తాము తాలిబన్లను సైన్యం సహాయంతో ఓడించగలమని, కాని ప్రజలను కాపాడుకోకపోతే భవిష్యత్తులో వారి మద్దతును కోల్పోతామని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుండగా పాకిస్థాన్ సైన్యం స్వాత్ లోయలో తాలిబన్ ఉగ్రవాదులపై దాడులకు పాల్పడినప్పుడే అమెరికా తమ దేశాన్ని తప్పుబట్టిందని ఆయని ఆవేదన వ్యక్తం చేశారు. పాక్ సైనికులు తాలిబన్లపై దాడులకు పాల్పడినప్పుడు అక్కడి సాధారణ పౌరులు దాదాపు 8 లక్షల 30 వేలమంది స్వాత్ లోయను విడిచివెళ్ళిపోయారని ప్రభుత్వ లెక్కవలు చెబుతున్నాయని ఆయన అసెంబ్లీకి వివరించారు. కాగా పాక్ వాయువ్య ప్రాంతంనుంచి దాదాపు 5 లక్షలమంది ప్రజలు గతంలోనే వలస పోయారని ఆయన తెలిపారు. |