భారతదేశానికి చెందిన వన్యప్రాణి శాస్త్రవేత్త డాక్టర్ ఎం.డి. మధుసూధన్‌కు "గ్రీన్ ఆస్కార్" గా పిలుచుకునే విట్లీ అవార్డు లభించింది.
లండన్‌లోని రాయల్ జియోగ్రఫికల్ సొసైటీలో జరిగిన ఓ కార్యక్రమంలో యువరాణి ఏన్ ఆయనకు అవార్డుగా ట్రోఫీని, 30వేల పౌండ్ల నగదు బహుమతిని అందజేశారు.
ఇదిలావుండగా ఇదే కార్యక్రమంలో వన్యప్రాణుల సంరక్షణ కోసం కృషి చేసిన మరో ఇద్దరు భారతీయులకు అసోసియేట్ అవార్డులను బహుకరించారు.
కాగా మధుసూధన్ దేశంలోని కర్ణాణకలోని పడమటి కనుమల్లోని ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణకోసం ఏర్పాటు చేసిన "నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్" సంస్థకు ఆయన డైరెక్టరుగా పని చేస్తున్నారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం కృషి చేసిన సందర్భంగా ఈ అవార్డుకు ఎంపికైనట్లు సమాచారం. |