ఎల్టీటీఈ తీవ్రవాదులతో పోరు జరుగుతున్న ప్రాతంలో చిక్కుకుపోయిన ప్రజలను మరో 48 గంటల్లోగా అక్కడినుంచి తప్పిస్తామని శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్స చెప్పినట్టు ప్రభుత్వ సమాచారశాఖ తెలిపింది.
శ్రీలంక ప్రజలు నివశిస్తున్న జోర్డాన్ దేశాన్ని సందర్శించిన సందర్భంగా గురువారం రాత్రి రాజపక్స ఈ నిర్ణయాన్ని వెలువరించినట్టు శుక్రవారం శ్రీలంక ప్రభుత్వ సమాచార శాఖ పేర్కొంది.
అధ్యక్షుడు రాజపక్స ప్రకటన నేపథ్యంలో పోరు జరుగుతున్న ప్రాంతాలనుంచి వేలసంఖ్యలో తమిళ ప్రజలు సైనిక ఆధీనంలోని ప్రాంతానికి తరలిరావడం ప్రారంభమైంది. అదేసమయంలో శ్రీలంక సేనలు సైతం ఎల్టీటీఈ తీవ్రవాదుల ఆధీనంలో ఉన్న చివరి ప్రాంతాన్ని సైతం చుట్టుముట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో శ్రీలంకలోని ఓ టీవీ ఛానెల్ రిపోర్టర్ మాట్లాడుతూ శుక్రవారం శ్రీలంక సేనలు ఎల్టీటీఈ తీవ్రవాదులకు మధ్య ముల్లైతీవు ప్రాంతంలో జరుగుతున్న పోరు కారణంగా పెద్ద ఎత్తున పేలుళ్లు జరుగుతున్నాయని దీని కారణంగా పెద్ద ఎత్తున పొగ ఆకాశం వైపుగా ఎగసిపడుతోందని తెలిపారు. |