ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > అంతర్జాతీయ > సూకీని విడుదల చేయండి: అమెరికా
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సూకీని విడుదల చేయండి: అమెరికా
మయన్మార్ ప్రజాస్వామిక నాయకురాలు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని విడుదలచేయాలని అమెరికా కోరింది.

సూకీని అరెస్టు చేయడం తమకెంతో బాధగా ఉందని, ఆమెను వెంటనే విడుదల చేయాలని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఇయాన్ కేలీ తమ భాధను వ్యక్త పరిచారు.

సూకీ నిర్బంధంలో ఉన్న ఇంట్లోకి గత వారం అమెరికన్ పౌరుడు ఒకరు చొరబడ్డారన్న నెపంతో ఆమెపై విచారణను ప్రారంభించేందుకు గురువారంనాడు ఆమెను జైలుకు తరలించారు. ఈ సందర్భంగా తాము ఆమెను విడుదల చేయాలని కోరుతున్నట్ల అమెరికా విదేశాంగ ప్రతినిధి తెలిపారు.

మయన్మార్ ప్రజాస్వామిక నాయకురాలైన ఆంగ్ సాన్ సూకీని జైలుకు తరలించడంపై అమెరికా విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్ ఆందోళన చెందారు. ఇది అన్యాయమని, అప్రజాస్వామికమని ఆమె దుయ్యబట్టారు.

ఇదిలావుండగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్‌కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తాం: లంక
అంతర్జాతీయ శక్తిగా భారత్‌ : అమెరికా
గ్రీన్ ఆస్కార్ అవార్డు పొందిన "భారతీయుడు"
తాలిబన్లను ఓడిస్తాం: గిలానీ
స్వైన్‌ఫ్లూతో మెక్సికోలో 60మంది మృతి
సోమాలియాలో ఇస్లాం చట్టం...!