న్యూయార్క్‌లోని ఒక విద్యాలయంలోని ఉద్యోగికి స్వైన్‌ఫ్లూ వ్యాధిబారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో అక్కడి మూడు విద్యాలయాలను రెండు వారాలపాటు మూసివేశారు.
న్యూయార్క్‌లోని మూడు విద్యాలయాలను రెండు వారాలపాటు మూసివేసినట్లు మైకేల్ బ్లూమ్ బర్గ్ తెలిపారు. న్యూయార్క్ గవర్నర్ డేవిడ్ పీటర్సన్ కూడా ఈ విషయమై ధృవీకరించారు.
క్వీన్స్ నైబర్‌హుడ్‌కు చెందిన ఓ విద్యాలయంలోని నలుగురు విద్యార్థులకు స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు నిర్థారించామని, దీంతోబాటు ఆ సంస్థలోని ఉద్యోగులకుకూడా ఈ వ్యాధి సోకినట్టు కనుగొన్నామని మైకేల్ బ్లూమ్ బర్గ్ తెలిపారు
ఇదిలావుండగా అక్కడి విద్యాలయాలలో దాదాపు 50 మందికి పైగా విద్యార్థులలో స్వైన్‌ఫ్లూ వ్యాధి లక్షణాలున్నట్లు కనుగొనడం కారణంగా వారిని ఇండ్లకు పంపించడం జరిగిందని ఆయన తెలిపారు. కాగా మరో విద్యాలయంలో 29మంది విద్యార్థులకు స్వైన్‌ఫ్లూ వ్యాధి లక్షణాలున్నట్లు తెలిసిందని ఆయన వివరించారు.
|