ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యం కారణంగా అతలాకుతలమౌతున్న దేశాలలో ఆఫ్రికా మరింత దిగజారిందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. గత నాలుగు దశాబ్దాలలో ఆఫ్రికా జనాభా దాదాపు వందకోట్లకు చేరుకుందని సమితి తెలిపింది.
ఆఫ్రికాలోని భూభాగంలో కీటాణువులను నాశనం చేయడానికి ఉపయోగించిన రసాయనాలు, భూమిలో సారంకోల్పోవడం, వాతావరణంలోని మార్పుల కారణంగా వ్యవసాయానికి పనికిరాకుండా పోయిన భూమి దాదాపు 50శాతానికిపైగానే ఉందని సమితి ప్రకటించింది.
ఇదిలావుండగా అక్కడ నీటి కొరత అధికంగా ఉందని, రానున్న రోజులలో పరిస్థితి దుర్భరంగా మారే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని వాతావరణ శాఖాధికారులు పేర్కొన్నట్లు సమితి పేర్కొంది.
వాతావరణ పరిశోధన సంస్థ రూపొందించిన ఓ నివేదికలో ఈ విషయాలు తెలిసినట్లు సమితి ప్రకటించింది. కాగా అక్కడ ప్రస్తుతం నీటిని ఎలా పొదుపుగా వాడుకోవాల్సిన చర్యలగురించి చర్చలు జరుగుతున్నాయని, అలాగే ఆర్థికమాంద్యంనుంచి గట్టేకేందుకు తగిన ఏర్పాట్లనుకూడా ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకునేలా తాము సూచించినట్లు సమితి పేర్కొంది. |