ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > అంతర్జాతీయ > భారత్ వ్యతిరేక కార్యకలాపాలు సాగనివ్వం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
భారత్ వ్యతిరేక కార్యకలాపాలు సాగనివ్వం
నేపాల్ భూభాగాన్ని భారత్ వ్యతిరేక కార్యకలాపాల కోసం ఉపయోగించుకునేందుకు విదేశీ తీవ్రవాద శక్తులు వ్యూహరచన చేస్తున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఆ దేశ ప్రభుత్వం తమ భూభాగంలో అటువంటి వాటిని ప్రతిఘటిస్తామని హామీ ఇచ్చింది.

భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు తమ భూభాగం ఉపయోగపడకుండా చూస్తామని నేపాల్ ప్రభుత్వం తెలిపింది. ఇటువంటి కార్యకలాపాలకు ఎవరైనా ఒడిగడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

నేపాల్ ప్రధానమంత్రి మాధవ్ కుమార్ నేపాల్ విదేశీ వ్యవహారాల సలహాదారు రాజన్ భట్టారీ మాట్లాడుతూ.. తమ భూభాగంలో పొరుగుదేశాల వ్యతిరేక కార్యకలాపాలకు ఆస్కారం ఇవ్వబోమని స్పష్టం చేశారు.

భారత్‌పై దాడుల కోసం విదేశీ తీవ్రవాద శక్తులు నేపాల్ భూభాగాన్ని ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
అన్నీ జాతివివక్షతో కూడినవి కాదు: ఎఫ్ఐఎస్ఏ
బ్రిటన్‌లో 85 ఇస్లామిక్ షరియా కోర్టులు
ఆయనతో ఎఫైర్ నిజమే: అర్జెంటీనా మహిళ
ఐదుగురు సిబ్బందిని విడిచిపెట్టిన ఇరాన్
గగుర్పొడిచే మైఖేల్ శవ రిపోర్టు
అంతర్జాతీయ నీలిచిత్రాల ముఠా గుట్టురట్టు