ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > అంతర్జాతీయ > మైఖేల్ అంత్యక్రియలు నెవర్‌లాండ్‌లో కాదు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మైఖేల్ అంత్యక్రియలు నెవర్‌లాండ్‌లో కాదు
పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ అంత్యక్రియలు నెవర్‌లాండ్ ఎస్టేట్ చేయాలనే ఆలోచనను ఆయన కుటుంబసభ్యులు విరమించుకున్నారు. మైఖేల్ జాక్సన్ ఎంతో ఇష్టపడి కట్టుకున్న నెవర్‌లాండ్ ఎస్టేట్‌లోనే ఆయన అంత్యక్రియలు జరుగుతాయని చాలామంది భావిస్తూ వచ్చారు. అయితే మైఖేల్ జాక్సన్ అంత్యక్రియలు నెవర్‌లాండ్‌లో జరగవని కుటుంబవర్గాలు తెలిపాయి.

అంత్యక్రియలు జరిగే ప్రదేశంపై ఇప్పటికీ ఎటువంటి సమాచారం లేదు. మైఖేల్ అంత్యక్రియలు జులై 5న జరుగుతాయని అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే శుక్రవారం నుంచి అభిమానుల సందర్శనార్థం మైఖేల్ జాక్సన్ భౌతిక కాయాన్ని నెవర్‌లాండ్ ఎస్టేట్‌లో ఉంచనున్నారు.

నెవర్‌లాండ్ ఎస్టేట్‌లో మైఖేల్ అంత్యక్రియలు జరగకపోవడంపై అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే 2002లో మైఖేల్ జాక్సన్ సంతకం చేసినట్లు భావిస్తున్న వీలునామాను బుధవారం లాస్ ఏంజెలెస్ సుపీరియర్ కోర్టులో ప్రవేశపెట్టారు.

ఈ వీలునామాలో నెవర్‌లాండ్ ఎస్టేట్‌ను మైఖేల్ జాక్సన్ తన కుటుంబ ట్రస్టుకు అప్పగించారు. తన పిల్లల సంరక్షణ బాధ్యతలను తన తల్లి కేథరీన్ జాక్సన్ చేపట్టాలని, ఆమెకు ఏదైనా జరిగిన పక్షంలో తన చిరకాల స్నేహితురాలు డయానా రాస్‌కు పిల్లల సంరక్షణ బాధ్యతలు అప్పగించాలని మైఖేల్ జాక్సన్ ఈ వీలునామాలో రాశారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
భారతీయుల మరణవార్తలకు ఆస్ట్రేలియా ఖండన
మైఖేల్ వీలునామా: మొత్తం ఆస్తి కుటుంబానికే
డెట్రాయిట్ బస్‌స్టాప్‌లో కాల్పులు
భుట్టో హత్యపై దర్యాప్తు ప్రారంభించిన ఐరాస
యెమెనియా విమానం బ్లాక్ బాక్స్ గుర్తింపు
సైన్యం ఉపసంహరణ ముఖ్యమైన మైలురాయి