ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > అంతర్జాతీయ > ముంబై దాడి: నిందితుల వద్ద విచారణ వాయిదా
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ముంబై దాడి: నిందితుల వద్ద విచారణ వాయిదా
దేశ వాణిజ్య రాజధాని ముంబైపై తీవ్రవాదులు జరిపిన దాడులకు సంబంధించి పాకిస్థాన్‌కు చెందిన నిందితుల వద్ద నిర్వహించాల్సిన విచారణ మరోమారు వాయిదా పడింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లష్కర్ తోయిబా తీవ్రవాదుల వద్ద విచారణకు సంబంధించిన కేసును పాక్ కోర్టు వాయిదా వేసింది.

ఈ దాడులకు సంబంధించి లష్కర్ ఇ తోయిబా సంస్థకు చెందిన ముఖ్య నేత జహీర్ రెహ్మాన్ లఖ్వీతో పాటు.. ఐదు మందిపై రావల్పిండిలోని తీవ్రవాద వ్యతిరేక కోర్టులో కేసు దాఖలైంది. ఈ కేసును న్యాయమూర్తి షాహీ మహ్మద్ విచారణ జరుపుతున్నారు.

ఈ పరిస్థితుల్లో ఆయన్ను ఆకస్మికంగా మరో కోర్టుకు బదిలీ చేశారు. దీంతో ఈ నేపథ్యంలో శనివారం జరగాల్సిన కేసు విచారణ వాయిదా పడింది. అయితే, ఈ కేసు విచారణకు సంబంధించి న్యాయమూర్తిని ఇంకా నియమించక పోవడంతో కేసు విచారణ జులై 18వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఇతరుల కంటే అంతర్గత ముప్పే ఎక్కువ: కియానీ
ఆయుధ ఒప్పంద వార్తలను ఖండించిన శ్రీలంక
మళ్లీ క్షిపణి పరీక్షలు నిర్వహించిన ఉ కొరియా
జాక్సన్ బిడ్డకు తండ్రిని నేను కాదు: మాల్నిక్
న్యూజిలాండ్‌లో మూడు స్వైన్ ప్లూ మరణాలు
అమెరికాలో కటకటాలపాలైన భారతీయులు