జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » 26/11: లష్కరే తీవ్రవాదిని అరెస్ట్ చేసిన పాక్ (Mumbai attacks | Pakistan | Lashkar-e-Toiba)
 
ముంబయి ఉగ్రవాద దాడులపై పాకిస్థాన్ అధికారిక యంత్రాంగం జరుపుతున్న దర్యాప్తులో గుర్తించదగిన మరో పరిణామం చోటుచేసుకుంది. ముంబయి దాడులకు కుట్ర పన్నిన ఓ తీవ్రవాదిని పాకిస్థాన్ ప్రభుత్వం అరెస్టు చేసింది. అతనికి లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు పాక్ యంత్రాంగం అనుమానిస్తోంది.

పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ)కు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ అనుమానిత లష్కరే తోయిబా తీవ్రవాదిని అదుపులోకి తీసుకుంది. ముంబయి ఉగ్రవాద దాడులకు తమ దేశంలోని సంబంధాలపై ఈ బృందం దర్యాప్తు జరుపుతోంది. గతంలో అరెస్టు చేసిన నిందితులు ఇచ్చిన వివరాలను ఆధారంగా చేసుకొని తాజాగా పాక్ యంత్రాంగం జామిల్ అహ్మద్ అనే వ్యక్తిని అరెస్టు చేసింది.

పాకిస్థాన్‌లోని సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లోని భట్టాగ్రామ్ ప్రాంతానికి చెందిన అహ్మద్‌ను ముంబయి ఉగ్రవాద దాడుల కేసులో ముఖ్య అనుమానితుడిగా పాక్ అధికారిక వర్గాలు భావిస్తున్నాయని డైలీ టైమ్స్ పత్రిక గురువారం ఓ కథనాన్ని వెల్లడించింది.

పాక్ అధికారిక యంత్రాంగం ముంబయి దాడులకు సంబంధించి ఇప్పటికే లష్కరే తోయిబాకు చెందిన ఐదుగురు తీవ్రవాదులను అరెస్టు చేసింది.

లష్కరే ఆపరేషన్స్ కమాండర్ జాకీవుర్ రెహమాన్ లఖ్వీ, అబు అల్ ఖామా, జరార్ షా, షాహిద్ జామిల్ రియాజ్, హమాద్ అమీన్ సాదీక్‌లు ప్రస్తుతం ముంబయి దాడులకు సంబంధించి విచారణ ఎదుర్కొంటున్నారు. వీరు వెల్లడించిన వివరాల ఆధారంగా పాక్ యంత్రాంగం అహ్మద్‌‍ను అరెస్టు చేసింది. ముంబయి దాడులకు వీరే సూత్రధారులను పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ భావిస్తోంది.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.