జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » స్వైన్‌ఫ్లూ బారినపడ్డ కొలంబియా అధ్యక్షుడు (Columbia | Swine Flu | President | Alvuro Yurib |)
 
కొలంబియా అధ్యక్షుడు అల్వరో యూరీబ్‌ స్వైన్‌ఫ్లూ మహమ్మారి బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయనకు అధికారిక వైద్యులు చికిత్సనందిస్తున్నారని కొలంబియా సామాజిక రక్షణ శాఖామంత్రి డియేగో పైలేసియో తెలిపారు.

తమ దేశ అధ్యక్షుడు స్వైన్‌ఫ్లూ బారిన పడినప్పటికీ, ఆ వ్యాధి అంత తీవ్రంగా లేదని మంత్రి తెలిపారు. ఆయన శుక్రవారం ఈ వ్యాధిబారిన పడ్డారని మంత్రి వెల్లడించారు. తమ దేశ అధ్యక్షుడు త్వరగా కోలుకుంటారని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

గత శుక్రవారంనాడు అర్జెంటీనాలో జరిగిన దక్షిణ అమెరికా నేతల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. శనివారానికి ఆయన ఈ మహమ్మారి వ్యాధిబారిన పడ్డారని మంత్రి పేర్కొన్నారు.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.