జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » రష్యా యుద్ధనౌక హైజాక్‌లో పాకిస్థాన్ హస్తం? (Russian Warship | Hijack | Somali pirates)
 
సోమాలియా సముద్రపు దొంగలు ఈ ఏడాది ఏప్రిల్‌లో రష్యా యుద్ధనౌకను ఒకదానిని హైజాక్ చేశారు. అయితే ఈ హైజాక్ వ్యవహారం వెనుక పాకిస్థాన్ పౌరుల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నౌక హైజాక్‌పై జరిపిన దర్యాప్తులో 12 మంది పాకిస్థాన్ పౌరులకు దీనిలో ప్రమేయం ఉన్నట్లు టైమ్స్ నౌ వార్తా ఛానల్ వెల్లడించింది.

12 మంది పాకిస్థానీయులు, సోమాలియా సముద్రపు దొంగలు (పైరేట్లు) తమ నౌకను హైజాక్ చేశారని రష్యా ఆరోపించింది. రష్యా యుద్ధ నౌక హైజాక్ వ్యవహారంపై పాకిస్థాన్ ఇప్పటివరకు ఎటువంటి దర్యాప్తు చేపట్టలేదు. రష్యా ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మంది పాకిస్థానీయులు చేపలు పట్టేవారని పాకిస్థాన్ తెలిపింది.

ఇదిలా ఉంటే సోమాలియా తీరంలో జరుగుతున్న నౌకల హైజాక్ వ్యవహారాల్లో పాకిస్థాన్ పౌరుల ప్రమేయం ఉందని ఆరోపణలు రావడం ఇదే తొలిసారి. సోమాలియా సముద్రపు దొంగలకు పాకిస్థాన్ తీవ్రవాద సంస్థలకు సంబంధాలు ఉన్నాయని ఇప్పుడు అనుమానాలు బయలుదేరాయి. ఏప్రిల్ 28న పాకిస్థాన్ పౌరులు, సోమాలియా పైరేట్లు కలిసి రష్యా యుద్ధనౌకను హైజాక్ చేశారని ఈ టీవీ ఛానల్ వెల్లడించింది.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.