జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » అణు గడువు ముప్పుతో భయం లేదు: ఇరాన్ (Nuclear deadline | Iran | Six world powers)
 
తమ వివాదాస్పద అణు కార్యక్రమంపై అగ్రరాజ్యాల బెదిరింపులకు లేదా వాటి నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లకు లొంగిపోయే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అగ్రరాజ్యాలు విధించిన గడువుకు తాము భయపడబోమని తేల్చిచెప్పింది.

చర్చల మార్గంపై తమకు విశ్వాసం ఉందని, ఇరాన్ ఈ మార్గాన్ని నమ్మే దేశమని విదేశాంగ శాఖ ప్రతినిధి హసన్ ఘాష్ఘావీ తెలిపారు.

ఆరు అగ్రరాజ్యాలు బెదిరింపులు, ఒత్తిళ్ల ద్వారా తమను లొంగదీసుకునేందుకు చేసే ఎటువంటి ప్రయత్నాలనైనా వ్యతిరేకిస్తామని, వారు అణు కార్యక్రమంపై విధించే ఎటువంటి గడువుకు అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఇరాన్‌కు చెందిన ఐఆర్ఎన్ఏ వార్తా సంస్థ వార్తలు వెల్లడించింది.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.