పాకిస్థాన్‌లోని వాయువ్య ప్రాంతమైన కోహత్ పట్టణంలో శుక్రవారంనాడు జనసమ్మర్థంగా ఉండే కచపాక మార్కెట్లో ఆత్మాహుతి దాడి జరగడంతో పదిమంది మృతి చెందగా మరికొందరు తీవ్రగాయాలపాలైనారు.
శుక్రవారం ఉదయం కోహత్ పట్టణంలో జనసమ్మర్థంగా ఉండే కచపాక మార్కెట్లో ఆత్మాహుతి దాడి జరగడంతో పదిమంది మృతి చెందగా మరికొందరు తీవ్రగాయాలపాలైనట్లు పోలీసులు వెల్లడించారు. ఆత్మాహుతి దాడులకు పాల్పడింది ఎవరేనేది ఇంకా తెలియరాలేదని వారు తెలిపారు.
దాడిలో తీవ్రగాయాలపాలైనవారిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలో ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ దాడి ఎవరిని ఉద్దేశించి చేసిందనేది తమ దర్యాప్తులో తేలాల్సి ఉందని వారు పేర్కొన్నారు.
ఈ పట్టణం ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉంది. కచపాక మార్కెట్లో జరిగిన ఈ పేలుడులో అనేక దుకాణాలు కూడా ధ్వంసమయ్యాయి. నిన్న కూడా ఇదే పట్టణంలో జరిగిన బాంబు పేలుడులో ఆరుగురు వ్యక్తులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదిలావుండగా ఆత్మాహుతి దాడితో తీవ్రమైన విస్ఫోటనం చెందగా మార్కెట్లోని పలు దుకాణాలు, చుట్టుపక్కలనున్న భూమి కంపించిందని అక్కడి స్థానికులు తెలిపారు.