ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » ఎట్టకేలకు హఫీజ్ సయీద్‌పై పాక్ ఎఫ్‌ఐఆర్ నమోదు (Mumbai terror | attacks | Hafiz Saeed | FIR | Pak | America)
అమెరికా ఒత్తిడికి పాకిస్థాన్ మరోమారు తలొగ్గింది. జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ముంబై దాడుల్లో సయీద్ పాత్ర ఉందని స్పష్టం చేసే పలు రకాల ఆధారాలు అందించినప్పటికీ.. ఏమాత్రం స్పందించని పాకిస్థాన్, అమెరికా ఒత్తిడికి తలొగ్గక తప్పలేదు. ఫలితంగా హఫీజ్‌పై దేశ ద్రోహం, తీవ్రవాదులకు నిధుల అందజేత, తదితర అభియోగాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
అయితే, పాక్ చర్య పట్ల భారత్ మాత్రం సంతృప్తి వ్యక్తం చేయలేదు. హఫీజ్‌ను తక్షణం అరెస్టు చేసి, చట్టముందు నిలబెట్టి శిక్షించాలని డిమాండ్ చేస్తోందని. ఇందుకు అవసరమైన పూర్తి ఆధారాలను పాక్‌కు అందించామని కేంద్రం చెపుతోంది.
ఇదిలావుండగా.. భారత్ డిమాండ్ చేస్తున్నట్టుగా హఫీజ్‌పై ముంబై పేలుళ్ళ కేసులో సంబంధం ఉన్నట్టు ఆరోపణలను పాక్ మోపలేదు. కాగా, హఫీజ్ నెలకొల్పిన జవాత్ ఉద్ దవా సంస్థను పాక్ ప్రభుత్వం గత 2008 డిసెంబరు నెలలో నిషేధం విధించింది.
ఆ తర్వాత ఆయనను అరెస్టు చేసి గృహ నిర్భంధంలో ఉంచింది. దీనిపై అమెరికాతో పాటు భారత్ కూడా నిరసన వ్యక్తం చేశాయి. అయితే, ఇన్ని రోజుల పాటు తాస్కారం చేసిన పాక్.. ఎట్టకేలకు అమెరికా ఒత్తిడికి తలొగ్గి సయీద్‌ను అరెస్టు చేయడం గమనార్హం.