ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » స్వైన్‌ఫ్లూ కారణంగా 3500మంది మృతి: డబ్ల్యూహెచ్ఓ (Swain flu | World Health Organization | Geneva | statistics | US)
ప్రపంచవ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ వ్యాధిబారిన పడి దాదాపు 3486 మందికిపైగా మృతి చెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది.
స్వైన్‌ఫ్లూ వ్యాధిబారిన పడి ఇప్పటికే 3486 మందికిపైగా మృతి చెందారని, ఓ వారం ముందు ఈ సంఖ్య కేవలం 3205కే ఉండిందని డబ్ల్యూహెచ్ఓ శుక్రవారంనాడు తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
ప్రపంచంలోని అగ్రరాజ్యమైన ఒక్క అమెరికాలోనే అత్యధికంగా 2625 మంది స్వైన్‌ఫ్లూ బారిన పడి మృతి చెందారు. ప్రపంచంలోనే ప్రశాంత క్షేత్రమైన ఆసియా ఖండంలో కేవలం 620 మంది మాత్రమే ఈ మహమ్మారి వ్యాధి బారిన పడి మృతి చెందారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. అదే యూరోప్‌లో అతి తక్కువగా 140 మంది మృతి చెందినట్లు సంస్థ తెలిపింది.
పశ్చిమాసియాలో 61, ఆఫ్రికాలో 40 మంది మృతి చెందారు. అమెరికాలో స్వైన్‌ఫ్లూ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని, అదే ఫ్రాన్స్, జపాన్ దేశాల్లోను ఈ మహమ్మారి వ్యాధి ప్రబలిందని సంస్థ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
ప్రస్తుతం మధ్య, దక్షిణ అమెరికా మరియు ఆసియాలో ఈ మహమ్మారి వ్యాధి విజృంభిస్తోందని, అదే ఆస్ట్రేలియా మరియు దక్షిణ ఆఫ్రికా దేశాలలో ఈ వ్యాధి తగ్గుముఖం పట్టిందని సంస్థ తన వారాంతపు లెక్కలలో తెలిపింది.