ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » చైనా అధికారులతో ప్రచండ రహస్య సమావేశం (Maoist chief Prachanda | Hong Kong | Chinese officials | Nepal | Sujatha Koirala)
నేపాల్‍కు చెందిన ప్రముఖ మావోయిస్ట్ అగ్రనాయకుడు ప్రచండ హాంగ్‌కాంగ్‌ను సందర్శించి అక్కడున్న ప్రముఖ చైనా అధికారులతో రహస్యంగా సమావేశమైనారు. తన సమావేశంలో ప్రస్తుత ప్రభుత్వాన్ని కూలదోసేందుకే పన్నాగం పన్ని ఉంటారని స్థానిక మీడియా అనుమానం వ్యక్తం చేసింది.
మావో నేత ప్రచండ ప్రత్యేకంగా నాలుగు రోజులపాటు హాంగ్‌కాంగ్ పర్యటన నిమిత్తం వచ్చారు. ఈ సందర్భంగా అక్కడున్న ఉన్నతాధికారులతో రహస్య సమావేశమైనట్లు నేపాల్‌కు చెందిన ఓ వార్తా పత్రిక వెల్లడించింది.
ఇదిలావుండగా నేపాల్ విదేశాంగ శాఖామంత్రి సుజాతా కొయిరాలా చైనా పర్యటనకు ముందు ప్రచండ హాంగ్‌కాంగ్‌లో పర్యటించారు. అక్కడ నెలకొన్న శాంతి వాతావరణాన్ని, నేపాల్‍లోని చట్టాలకు రూపకల్పనకు మావోయిస్టులు ప్రతిబంధకాలుగా మారారని ఈ సందర్భంగా ఆమె విమర్శించారు.
ప్రచండ హాంగ్‌కాంగ్ పర్యటన నిజమేనని, అక్కడ ఆయన ఉన్నతాధికారులతో సమావేశమైన మాట వాస్తవమేనని మావోయిస్టు ప్రతినిధి దీనానాథ్ శర్మ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అలాగే ఆయన పార్టీ సానుభూతిపరులతో కూడా సమావేశమైనట్లు వెల్లడించారు.
కాగా తను హాంగ్‌కాంగ్‌లో చైనా ఉన్నతాధికారులతో సమావేశమైనట్లు వచ్చిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ప్రచండ ఖండించారు.