జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » ఇరాన్ మాజీ అధ్యక్షునిపై ప్రత్యర్థుల దాడులు (Mohammad Khatmi | Iran | Former President of Iran | Attack)
 
ఇరాన్ మాజీ అద్యక్షుడు మొహమ్మద్ ఖాతమీ ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలో పాల్గొనే పక్షంలో ఆయనపై ప్రత్యర్థులు దాడులకు పాల్పడ్డారు.

విపక్షాలకు చెందిన వేలాదిమంది కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని వార్షిక ఇజ్రాయెలీ విరోధి కుద్స్ దినం సందర్భంగా నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ ర్యాలీలో పాల్గొన్నవారు పాలస్తానీయన్లపై సానుభూతిని ప్రకటించారు.

ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలో ప్రభుత్వం తరపున తెహ్రాన్‌లో నిర్వహించిన ర్యాలీలోను వేలాదిమంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన కూడళ్ళు, ప్రధాన రహదారుల్లో భద్రతా దళాలు మొహరించి ఉన్నాయి.

భద్రతా దళాలు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నా ర్యాలీలో పాల్గొన్న మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ ఖాతమీపై ప్రత్యర్థులు దాడులకు దిగడం శోచనీయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదిలావుండగా ఆయనపై దాడులకు పాల్పడ్డ వారిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.