ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » జర్మనీపై దాడులు చేస్తాం: అల్‌ఖైదా (Germany | September | Elections | Attack | Threaten | Al-Quida, Vedeo Ta)
జర్మనీలో సెప్టెంబర్ 27న జరగనున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తాము దాడులకు పాల్పడతామని అల్‌ఖైదా హెచ్చరించింది. ఈ హెచ్చరికలు వీడియో టేపు ద్వారా శనివారం బర్లిన్‌లో విడుదల చేసింది.
అక్కడ సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరగాలంటే ఆఫ్గనిస్థాన్‌లో పొంచి ఉన్న సైనికులను తొలగించాలని లేకుంటే వచ్చే ఆదివారం నాడు జరిగే ఎన్నికల సందర్భంగా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అల్‌ఖైదా విడుదల చేసిన టేపులో హెచ్చరించినట్లు అక్కడి మీడియా తెలిపింది.