దక్షిణ సూడన్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో 100 మంది పౌరులు మృతి చెందారని అధికారిక వర్గాలు మంగళవారం వెల్లడించాయి. రెండు ప్రత్యర్థి వర్గాల మధ్య జరిగిన ఘర్షణలతో దక్షిణ సూడాన్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జోంగ్లి రాష్ట్రంలో లౌ నుర్ గిరిజన వర్గానికి చెందిన సాయుధులు ప్రత్యర్థి గ్రూపుకు చెందిన ఓ గ్రామంపై ఆదివారం దాడి చేశారు.
ఈ దాడిలో వంద మంది మృతి చెందినట్లు ఐక్యరాజ్యసమితి యంత్రాంగం తెలిపింది. జోంగ్లి రాష్ట్రంలో గత నెలలో జరిగిన హింసాకాండలో లౌ నుర్ గిరిజన వర్గానికి చెందిన 185 మంది హత్య చేయబడ్డారు. ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన వర్గ ఘర్షణల్లో సుమారు 2000 మంది మృతి చెందినట్లు ఐరాస వర్గాలు అంచనా వేస్తున్నాయి.