ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » ఉగ్రవాదులను మట్టికరిపిస్తాం: మెహసూద్ అహ్మదీనెజాద్ (Iran | President | Mehasood Ahmadinejad | Terrorists | Punishment)
తమ దేశంలోని ఆగ్నేయ ప్రాంతంలోనున్న సిస్తాన్ బలూచిస్తాన్‌లో ఆదివారం నాడు జరిగిన ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డవారిని అదుపులోకి తీసుకోమని భద్రతాధికారులను తాము ఆదేశించామని ఇరాన్ అధ్యక్షుడు మహెసూద్ అహ్మదీనెజాద్ అన్నారు.
ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో ఇప్పటి వరకు దాదాపు 49 మంది మృతి చెందారని, ఈ దాడులకు పాల్పడ్డ తీవ్రవాదులను ఖచ్చితంగా పట్టుకుని వారికి శిక్ష విధించేలా తాము చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
సిస్తాన్ బలూచిస్తాన్‌లో జరిగిన సంఘటనతో తాము చింతిస్తున్నామని, ఈ దాడులకు పాల్పడ్డవారిని తాము తప్పక శిక్షించి తీరుతామని ఆయన ఆ దేశ ప్రజలకు ధైర్యం చెప్పారు.