ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » యూరప్, అమెరికాలలోనూ ఉగ్రవాద నియామకాలు ! (Europe | Taliban | Terrorists | Lashkar-e-Toiba | Training | Pakisthan | America | Washington)
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న తాలిబన్లు, లష్కర్-ఏ-తొయిబా ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాలను యూరోప్, అమెరికా దేశాలకు మరింతగా విస్తరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు ప్రాథమిక సమాచారం.
తాలిబన్, లష్కర్-ఏ-తొయిబా ఉగ్రవాద సంస్థలు అమెరికా, యూరోప్ దేశాల్లో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు వాషింగ్టన్‌కు చెందిన ఓ పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
లష్కర్-ఏ-తొయిబా నిర్వాహకులు జర్మనీ, అమెరికా దేశాలలో కూడా తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారని, అక్కడున్న యువతను ఆకట్టుకుని వారికి ఉగ్రవాద శిక్షణనిస్తున్నట్లు ఆ పత్రిక పేర్కొంది.
వారికి ఉగ్రవాద శిక్షణనిచ్చిన తర్వాత వారిని ఆత్మాహుతి దళాలుగా మార్చి పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులకు తరలిస్తున్నారని ఆ పత్రిక తెలిపింది.
జర్మనీ నుంచి ఇప్పటికే 30 మందికిపైగా ఇలా సరిహద్దులు దాటి పాక్ ఉగ్రవాద శిక్షణా శిబిరాలకు చేరుకున్నారని, బ్రిటన్, అమెరికా నుంచి కూడా ఇదేవిధంగా శిక్షణ కోసం త్వరలో కొంత మంది యువకులు రాబోతున్నారని ఆ పత్రిక వెల్లడించింది.