జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » ఆత్మాహుతి దాడికి అమెరికానే కారణం: మతపెద్దలు (Sucide Attack | Iran | Pakistan | America | England | Army Chief)
Feedback Print Bookmark and Share
 
ఇరాన్ దేశంలోని సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడికి అమెరికానే ప్రధాన కారణమని ఇరాన్ దేశ మతపెద్దలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆ దేశ మత పెద్ద అయడొల్లా అలీ ఘమోనీ మాట్లాడుతూ ఆత్మాహుతి దాడి వెనుక అమెరికా హస్తం ఉందని సందేహం వ్యక్తం చేశారు. ఇరాన్ దేశ భద్రతకు పెను సవాల్ విసిరిన ఈ ఆత్మాహుతి దాడి వెనుక కొన్ని అగ్రశక్తుల కుట్ర ఉండివుండవచ్చని వారు అంటున్నారు.

తమ దేశానికి వ్యతిరేకంగా కొన్ని దేశాలు తీవ్రవాద శక్తులలతో కలిసి పని చేస్తున్నాయని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను అమెరికా కొట్టిపారేసింది. ఇరాన్‌లోజరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ.. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపింది.

ఇకపోతే.. ఇరాన్ ఆర్మీ చీఫ్ కూడా అమెరికా హస్తం ఉండివుండవచ్చని సందేహం వ్యక్తం చేశారు. ఇరాన్-ఆఫ్గనిస్థాన్ సరిహద్దుల్లో జరిగిన ఈ దాడిలో 42 మంది మృత్యువాత పడిన విషయం తెల్సిందే. ఈ దాడి అమెరికా, బ్రిటన్, పాకిస్థాన్ దేశాలు కలిసి పన్నిన కుట్రగా పేర్కొన్నారు.

ఇదే విషయాన్ని ఇరాన్ అధ్యక్షుడు అహ్మదినేజాద్ కూడా వెల్లడించిన విషయం తెల్సిందే. తమ దేశంలో దాడికి పాల్పడిన తీవ్రవాదులు పాకిస్థాన్ గడ్డపై నుంచే పావులు కదిపారని ఆరోపించారు. తీవ్రవాదులను పాకిస్థాన్ తక్షణం అరెస్టు చేసి శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.