ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » భారత్‌లో పర్యటిస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు నషీద్ (Maldivian President | Mohamed Nasheed | India visit | climate change | bilateral ties)
ఐదు రోజుల పర్యటన నిమిత్తం ఈ రోజు ఉదయం మాల్దీవుల అధ్యక్షుడు మొహ్మద్ నషీద్ భారత్‌కు చేరుకున్నారు. ఆయన తన పర్యటనలో ముందుగా.. వాతావరణ మార్పుపై ఏర్పాటు చేసే సదస్సుకు హాజరవుతారు. ఈ సమావేశంలో భారత్, మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలపై సమీక్షిస్తారు.
వాతావరణ మార్పుపై మరియు సాంకేతిక పరిజ్ఞాన మార్పిడిపై ఢిల్లీలో నిర్వహించే అత్యున్నత సమావేశానికి గౌరవ అతిథిగా నషీద్ వస్తున్నారు. ఆ తర్వాత షెడ్యూల్ ప్రకారం భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌తో భేటీ అవుతారు. డిసెంబర్‌లో కొపెన్‌హాగన్‌లో జరిగే వాతావరణ సదస్సు నేపథ్యంలో.. వాతావరణ మార్పు తదితర అంశాలపై మన్మోహన్‌తో నషీద్ ప్రధానంగా చర్చించనున్నారు.
ఇప్పటికే.. ఆరోగ్యం, విద్య, ఆర్థిక ప్రాజెక్టులు, అభివృద్ధి కోసం పరస్పర సాయం వంటి రంగాల్లో భారత్, మాల్దీవుల మధ్య పరస్పర సహకారంపై ఇరు దేశాల అధికారులు సమీక్షించనున్నారు. ఈ పర్యటనలో నషీద్‌తో పాటు మాల్దీవుల ప్రతినిధులు, మంత్రులు, మీడియా ప్రతినిధులు కూడా ఉంటారు.
మన్మోహన్ ఆహ్వానం మేరకు నషీద్ భారత్ పర్యటనకు వచ్చారు. 2008, నవంబర్‌లో మాల్దీవుల అధక్షుడిగా ఎంపికైన నషీద్.. భారత పర్యటనకు రావడం ఇది రెండో సారి.