జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » ఆఫ్గన్, పాక్ దేశాల్లో తీవ్ర భూకంపం (Afghanisthan | Pakisthan | Earth Quake | America | Rector Scale)
Feedback Print Bookmark and Share
 
ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్ దేశాల్లో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్ర భూకంపం సంభవించింది.

ఆఫ్గన్, పాక్ దేశాల్లో గురువారం అర్దరాత్రి దాటిన తర్వాత తీవ్ర భూకంపం సంభవించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైనట్లు అమెరికా భూగర్భ పరిశోదన సంస్థ వెల్లడించింది.

ఈ భూకంపం ఆఫ్గనిస్థాన్‌లోని ఉత్తరంలోనున్న ఆగ్నేయ ప్రాంతమైన ఫైజాబాద్‌లో సంభవించిందని అమెరికా భూగర్భ పరిశోదన సంస్థకు చెందిన అధికారులు తెలిపారు.

ఫైజాబాద్ హిందూకుశ్ క్షేత్రంలో ఉంది. ఈ భూకంపం భారతదేశపు సమయానుసారం(ఐఎస్‌టీ) రాత్రి ఒంటిగంట ఇరవై ఒక్క నిమిషాలకు సంభవించింది.

భూకంప తీవ్రత ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్ దేశాల్లోని పలు క్షేత్రాల్లో కనపడిందని అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో పలు ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.

భూకంపం సంభవించడంతో ఎవ్వరికీ ప్రాణ నష్టం కలగలేదని, ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్‌లో భూమి కంపించడంతో స్థానికులు తమ ఇళ్ళను వదిలి బయటకు పరుగులు తీసినట్లు సమాచారం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.