ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » మా నాన్న పాప్ స్టార్.. మేము ఫిలిమ్ స్టార్స్: జాక్సన్ కిడ్స్ (POP Music World | Pop Star | Mischel Jacson | Sons | Film Star | Contact Music)
మా నాన్న పాప్ స్టార్.. మేము ఫిలిమ్ స్టార్స్: జాక్సన్ కిడ్స్
FILE
పాప్ సంగీత సామ్రాజ్యంలో ఓ వెలుగు వెలిగిన పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ పిల్లలు ఆయన బాటలో నడవాలనుకోవడం లేదు. సంగీత ప్రపంచంలో తమ సత్తా చాటేకన్నా ఫిల్మ్ స్టార్‌లుగా వెలిగిపోవాలని కలలు కంటున్నామని చెపుతున్నారు జాక్సన్ పిల్లలు.
మైఖేల్ జాక్సన్ ముగ్గురు పిల్లలు కూడా చిత్ర నటులు కావాలనుకుంటున్నారని, జాక్సన్ బాటలో పయనించాలనుకోవడం లేదని జాక్సన్ సోదరుడు జర్మైన్ తెలిపినట్లు కాంటాక్ట్ మ్యూజిక్ సంస్థ లండన్‌లో శుక్రవారం వెల్లడించింది.
ఇదిలావుండగా జాక్సన్ తల్లి క్యాథరిన్(79) గతంలో జాక్సన్ నటించిన " దిస్ ఈజ్ ఇట్ " డాక్యుమెంటరీ చిత్రాన్ని చూడాలనుకోవడం లేదట. దానికి కారణం ఆమె తన కుమారుడైన జాక్సన్ మృతి వల్ల కలిగిన దుఃఖం నుంచి ఇంకా తేరుకోలేదని, సమయం వచ్చినప్పుడు ఆమె ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని చూస్తానంటున్నారని ఆమె కుమారుడు జర్మైన్ పేర్కొన్నారు.