జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » భవిష్యత్తులో అమెరికా అధ్యక్షునిగా బాబీ జిందాల్ (Lusiana | India | Bobby Jindal | America | President | White House |)
Feedback Print Bookmark and Share
 
లూసియానగవర్నర్‌గానున్న భారతదేశపు సంతతికి చెందిన బాబీ జిందాల్ అమెరికా దేశానికి అధ్యక్షునిగా ఎన్నికవుతారని వైట్‌హౌస్‌కు చెందిన మాజీ అధికారి శంభు బానిక్ ఆశాభావం వ్యక్తం చేశారు.

శంభు బానిక్ దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం మెంటల్ రిటార్డేషన్ విషయంపై ఆ దేశాధ్యక్షుని కమిటీలో కార్యనిర్వాహక డైరెక్టర్‌గా నియమించబడ్డారు. ఆ రోజుల్లో ఇలాంటి వారికి అత్యున్నతమైన పదవి లభించడం చాలా అరుదైన విషయం, ఎంతో గౌరవంతో కూడుకున్నది.

ఒకానొక రోజు 38 సంవత్సరాల వయసు కలిగిన రిపబ్లికన్ పార్టీకి చెందిన బాబీ జిందాల్ అమెరికా అధ్యక్షునిగా ఎన్నికవుతారని బానిక్ తను రచించిన పుస్తకం " బార్న్ ఆర్డినరీ లివ్డ్ ఎక్స్‌ట్రార్డినరీ "లో పేర్కొన్నారు. ఈ పుస్తకం శుక్రవారం విడుదలవుతుంది.

జిందాల్ భవిష్యత్తు చాలా ఉజ్వలమైందని, భారతీయ అమెరికన్లు ఆయన గురించి గర్వించాల్సిన అవసరం ఉందని తన స్వీయచరిత్రలో బానిక్ రాసుకున్నారు.

రాజకీయ పదవులను పొందాలనుకునే యువత ఈయన జీవిత చరిత్ర ఆదర్శవంతం కాగలదని 74 సంవత్సరాలు కలిగిన బానిక్ తన రచనలో పేర్కొన్నారు.

రెండు దశాబ్దాల క్రితం బానిక్ అధ్యక్షుని పరిపాలన కార్యాలయంలో ఉద్యోగిగా చేరినప్పుడు భారతీయ అమెరికన్లలో బలహీనుల్లో బానిక్ ఒకరు కావడం గమనార్హం. కాని ప్రస్తుతం పరిస్థితి అలా లేదు.

అమెరికా దేశంలో ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా తన ప్రభుత్వంలో భారతీయ సంతతికి చెందిన వారిని ఒక డజనుకుపైగా స్థానం కల్పించారు. ఈ కారణంగానే బానిక్ ఇలా చెప్పివుండవచ్చంటున్నారు విశ్లేషకులు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.